Sunday, 24 December 2017

పుట్టగొడుగుల పలావ్ - తెలుగు వంటలు

పుట్టగొడుగుల పలావ్

పుట్టగొడుగుల పలావ్ కు కావలసిన  పదార్థములు:

Puttagodugula Palav - Easy Telugu Vantalu
Puttagodugula Palav - Easy Telugu Vantalu
  • పలావు బియ్యం             :   1 కిలో
  • పుట్టగొడుగులు              :   300 గ్రా.
  • లవంగాలు                     :   2
  • పెరుగు                          :   అరకప్పు
  • ఉల్లిపాయలు                  :   2
  • ఎండుకొబ్బరి , నువ్వులు :   25 గ్రా.
  • గసగసాలు                     :   50 గ్రా.
  • అల్లం , వెల్లుల్లిపేస్ట్          3 స్పూనులు
  • ఉప్పు                           :     తగినంత
  • నూనె                            :     అరకప్పు
  • మిరియాలపొడి               :     తగినంత 

పుట్టగొడుగుల పలావ్ తయారుచేయు విధానం :

  1.  బియ్యం నాననివ్వాలి .
  2.  కొబ్బరి, నువ్వులు , గసగసాలు మెత్తగా రుబ్బుకోవాలి.
  3.  ఈ గసగసాలు ముద్దా అల్లం వెల్లుల్లి ముద్ద, ముష్రూమ్స్, ఉప్పు, పెప్పరు అన్ని కలిపి కాసేపు నాననివ్వాలి.
  4.  నానిన బియ్యాన్ని కాసేపు ఉడికించాలి.
  5.  పాత్రలో తగుపాటి నూనె మరిగించి పుట్టగొడుగులు, మాసాలను ఆ నూనెలో కొంచెం వేయించాలి
  6. దానిమీద ఉడికించిన బియ్యాన్ని గుమ్మరించి అరకప్పు నీళ్ళు పోసి గట్టిగా మూత పెట్టి 10 – 15 నిముషాలు బాటు సిమ్లో ఉడికించి దింపాలి.
  7. ఇష్టమైతే ఇందులోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చును.
  8. ఈ పలావు వేడివేడిగా తింటూ ఉల్లి పెరుగు పచ్చడి నంజుకుంటుoటే పుట్టగొడుగులు పలావు తినడానికయినా మరో వంద సార్లు పుట్టాలనిపిస్తుంది.

పుట్టగొడుగుల పలావ్ రెసిపీ వీడియో (You Tube) ద్వారా :



No comments:

Post a Comment