బీట్రూటు క్యారేట్ ఫ్రై
బీట్రూటు క్యారేట్ ఫ్రై కు కావలసిన పదార్థములు:
- బీట్రూటు : 1/4 కిలో
- క్యారేట్ : 2
- లవంగాలు : 2
- ఉల్లిపాయలు : 1
- చెక్కా : 2
- యేలకులు : 2
- అల్లం , వెల్లుల్లిపేస్ట్ : తగినంత
- ఉప్పు : తగినంత
- నూనె : సరిపడ
- కారం : సరిపడ
- పసుపు : సరిపడ
- కర్వేపాకు : కొద్దిగా
- కొత్తిమీర : కొద్దిగా
బీట్రూటు క్యారేట్ ఫ్రై తయారుచేయు విధానం :
- బీట్రూటు, క్యారేట్ ముక్కలు తరగాలి .
- ఉల్లి, మిర్చి ముక్కలుగా తరగాలి.
- ఉప్పు పసుపు వేసి కురముక్కలను ఉడికించి తడిలేకుండా చూడాలి.
- నూనె కాచి చెక్కా, లవంగాలు ఏలకులూ ఉల్లిమిర్చి ముక్కలు వేయించాలి.
- అల్లం ముద్ద కూడా అందులో వేయించి కారం చల్లి కురముక్కలేసి మగ్గించాలి.
- మగ్గాక కర్వేపాకు కొత్తిమీర వేసి కలియబెట్టి దించుకోవలెను.
బీట్రూటు క్యారేట్ ఫ్రై రెసిపీ వీడియో (You Tube) ద్వారా :
No comments:
Post a Comment