Wednesday, 27 December 2017

బీట్రూటు క్యారేట్ ఫ్రై - Beetroot Carrot Fry in Telugu

బీట్రూటు క్యారేట్ ఫ్రై

బీట్రూటు క్యారేట్ ఫ్రై కు కావలసిన  పదార్థములు:

Beetroot Carrot Fry - Easy Telugu Vantalu
Beetroot Carrot Fry - Easy Telugu Vantalu
  • బీట్రూటు                       :   1/4 కిలో
  • క్యారేట్                          :   2
  • లవంగాలు                     :   2
  • ఉల్లిపాయలు                  :   1
  • చెక్కా                            :   2
  • యేలకులు                     :   2
  • అల్లం , వెల్లుల్లిపేస్ట్           తగినంత
  • ఉప్పు                           :   తగినంత
  • నూనె                            సరిపడ
  • కారం                             :  సరిపడ
  • పసుపు                         :  సరిపడ
  • కర్వేపాకు                       :   కొద్దిగా 
  • కొత్తిమీర                        :   కొద్దిగా 

బీట్రూటు క్యారేట్ ఫ్రై తయారుచేయు విధానం :

  1.  బీట్రూటు, క్యారేట్ ముక్కలు తరగాలి .
  2.  ఉల్లి, మిర్చి ముక్కలుగా తరగాలి.
  3.  ఉప్పు పసుపు వేసి కురముక్కలను ఉడికించి తడిలేకుండా చూడాలి.
  4.  నూనె కాచి చెక్కా, లవంగాలు ఏలకులూ ఉల్లిమిర్చి ముక్కలు వేయించాలి.
  5.  అల్లం ముద్ద కూడా అందులో వేయించి కారం చల్లి కురముక్కలేసి మగ్గించాలి.
  6. మగ్గాక కర్వేపాకు కొత్తిమీర వేసి కలియబెట్టి దించుకోవలెను.

బీట్రూటు క్యారేట్ ఫ్రై రెసిపీ వీడియో (You Tube) ద్వారా :



Tuesday, 26 December 2017

కొబ్బరి , దోస, పెరుగు చట్నీ - తెలుగు వంటలు

కొబ్బరి , దోస, పెరుగు చట్నీ

కొబ్బరి , దోస, పెరుగు చట్నీ కు కావలసిన  పదార్థములు:

Kobbari Perugu Chutney - Easy Telugu Vantalu
Kobbari Perugu Chutney
  • పెరుగు                          :     1/2  లీటరు
  • దోసకాయ                     :     1
  • తాలింపు సామాన్లు         :     తగినంత
  • కర్వేపాకు, కొత్తిమీర        :     కొంచెం
  • ఉప్పు                           :     సరిపడ
  • నూనె                            :     తగినంత
  • కొబ్బరిముక్కలు             :     5
  • పచ్చిమిర్చి                    :     4

కొబ్బరి , దోస, పెరుగు చట్నీ తయారుచేయు విధానం :

  1.  దోసకాయను కడిగి చెక్కు తీసి చేదు లేకుండా చూసుకొని గింజలు తీసి సన్నని ముక్కలుగా తరుగుకోవాలి.
  2.  ఈ ముక్కలకి ఉప్పు కలిపి అరగంట ఉంచాలి.
  3.  కొబ్బరి, మిర్చిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
  4.  ఇప్పుడు పెరుగులో ఉప్పు, కొబ్బరి మిర్చి పేస్ట్ కలపాలి.
  5.  దోసముక్కల్ని గట్టిగా పిండి పెరుగు, కొబ్బరి మిశ్రమంలో కలిపి చివరగా తాలింపు పెట్టాలి.
  6.  ఆ తరువాత కొత్తిమీర చల్లి సర్వ్వ్ చేయాలి.

  7. కొబ్బరి , దోస, పెరుగు చట్నీ రెసిపీ వీడియో (You Tube) ద్వారా :




Monday, 25 December 2017

పేపర్ దోసె - తెలుగు వంటలు

పేపర్ దోసె

పేపర్ దోసె కు కావలసిన  పదార్థములు:

Paper Dosa - Easy Telugu Vantalu
Paper Dosa - Easy Telugu Vantalu
  • మినపప్పు                    :     1/4  కిలో
  • బియ్యం                        :     3/4  కిలో
  • ఉప్పు                           :     సరిపడ
  • నూనె                            :     తగినంత

పేపర్ దోసె తయారుచేయు విధానం:

  1.  ముందుగా బియ్యం, మినపప్పు విడివిడిగా నాననివ్వాలి .
  2.  నానిన తరువాత రెండింటిని కడిగి రుబ్బుకోవాలి. లేదా వేట్ గ్రైండర్ లో వేసి రుబ్బుకోవాలి.
  3.  రుబ్బిన వెంటనే దోసె వేస్తె చప్పగా ఉంటుంది.
  4.  మరుసటి రోజుకి కొద్దిగా పులుస్తుంది.
  5.  మూడోరోజు ఇంకా పులిసి రుచిగా ఉంటుంది.
  6.  చప్పగా ఉన్నప్పుడు పిండిలో నీరు బదులు పుల్లటి మజ్జిగ కలిపేస్తే కూడా రుచిగా ఉంటుంది. 
  7.  ఈ దోసెలలో ఉల్లిపాయ సన్నగా తరుగుకొని తినవచ్చు.
  8.  ప్లయిన్ దోసేనే పేపర్ దోసె అంటారు.
  9.  పేపర్ దోసె రెడీ.  

పేపర్ దోసె రెసిపీ వీడియో (You Tube) ద్వారా :



Sunday, 24 December 2017

పుట్టగొడుగుల పలావ్ - తెలుగు వంటలు

పుట్టగొడుగుల పలావ్

పుట్టగొడుగుల పలావ్ కు కావలసిన  పదార్థములు:

Puttagodugula Palav - Easy Telugu Vantalu
Puttagodugula Palav - Easy Telugu Vantalu
  • పలావు బియ్యం             :   1 కిలో
  • పుట్టగొడుగులు              :   300 గ్రా.
  • లవంగాలు                     :   2
  • పెరుగు                          :   అరకప్పు
  • ఉల్లిపాయలు                  :   2
  • ఎండుకొబ్బరి , నువ్వులు :   25 గ్రా.
  • గసగసాలు                     :   50 గ్రా.
  • అల్లం , వెల్లుల్లిపేస్ట్          3 స్పూనులు
  • ఉప్పు                           :     తగినంత
  • నూనె                            :     అరకప్పు
  • మిరియాలపొడి               :     తగినంత 

పుట్టగొడుగుల పలావ్ తయారుచేయు విధానం :

  1.  బియ్యం నాననివ్వాలి .
  2.  కొబ్బరి, నువ్వులు , గసగసాలు మెత్తగా రుబ్బుకోవాలి.
  3.  ఈ గసగసాలు ముద్దా అల్లం వెల్లుల్లి ముద్ద, ముష్రూమ్స్, ఉప్పు, పెప్పరు అన్ని కలిపి కాసేపు నాననివ్వాలి.
  4.  నానిన బియ్యాన్ని కాసేపు ఉడికించాలి.
  5.  పాత్రలో తగుపాటి నూనె మరిగించి పుట్టగొడుగులు, మాసాలను ఆ నూనెలో కొంచెం వేయించాలి
  6. దానిమీద ఉడికించిన బియ్యాన్ని గుమ్మరించి అరకప్పు నీళ్ళు పోసి గట్టిగా మూత పెట్టి 10 – 15 నిముషాలు బాటు సిమ్లో ఉడికించి దింపాలి.
  7. ఇష్టమైతే ఇందులోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చును.
  8. ఈ పలావు వేడివేడిగా తింటూ ఉల్లి పెరుగు పచ్చడి నంజుకుంటుoటే పుట్టగొడుగులు పలావు తినడానికయినా మరో వంద సార్లు పుట్టాలనిపిస్తుంది.

పుట్టగొడుగుల పలావ్ రెసిపీ వీడియో (You Tube) ద్వారా :



గుత్తి వంకాయ కర్రీ (Gutti Vankaya Curry(Kura) in Telugu)

గుత్తి వంకాయ కర్రీ

గుత్తి వంకాయ కర్రీ కు కావలసిన  పదార్థములు:

Gutti Vankaya Curry Kura Easy Telugu Vantalu
Gutti Vankaya Curry - Easy Telugu Vantalu
  • వంకాయ                     :     1/2  కిలో
  • కొబ్బరి కోరు                 :     1 కప్పు
  • ఉప్పు                          :     సరిపడ
  • కారం, నూనె                 :     తగినంత
  • పసుపు                        :     చిటికెడు
  • అల్లం                           :     చిన్నముక్క
  • పచ్చిమిర్చి, ఎండుమిర్చి :     10
  • ఉల్లిపాయలు                  :     2
  • కొత్తిమీర                        :     తగినంత

గుత్తి వంకాయ కర్రీ తయారుచేయు విధానం :

  1.  వంకాయల్ని శుభ్రంగా కడిగి 4 రెక్కలు గుత్తిలాగా తరగాలి.
  2.  కొద్దిపాటి నూనెలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి కోరు వేయీంచి దించాలి.
  3.  నూరుకొని కోసి ఉంచిన వంకాయగుత్తుల్లోకి పై మిశ్రమాన్ని కురాలి.
  4.  అనతరం మిగిలిన నూనెలో ఒక్కొక్క వంకాయని వేసి వేయించాలి.
  5.  కొంచెం సేపు మగ్గనిచ్చి పైన కొత్థిమీర జల్లి వేడి వేడిగా వడ్డించాలి .    

గుత్తి వంకాయ కర్రీ రెసిపీ వీడియో (You Tube) ద్వారా :