పప్పు మామిడికాయ
పప్పు మామిడికాయ కు కావలసిన పదార్థములు:
Pappu Mamidakaya - Easy Telugu vantalu |
- కందిపప్పు : 1/4 కిలో
- మామిడికాయ : 2
- తాలింపు సామాన్లు : తగినంత
- పచ్చిమిర్చి : 4
- ఎండుమిర్చి : 4
- ఉప్పు : సరిపడ
- పసుపు : చిటికెడు
- ఉల్లిపాయలు : 2
- కారం : తగినంత
- నూనె : తగినంత
- వెల్లుల్లి : 4 రేకలు
పప్పు మామిడికాయ తయారుచేయు విధానం :
- మొదట కందిపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్ళు వేసుకొని ఉడకనివ్వాలి.
- దానిలో మామిడకాయ తరిగిన ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా తరిగి కుక్కర్లో పెట్టాలి.
- బానిలిలో రెండు స్పూనులు నూనె వేసి కాగిన తరువాత తాలింపు సామాన్లు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు వఎంచిలి.
- ఉడికిన పప్పును బాణిలిలో వేసి కలియపెట్టి ఉప్పు వెయ్యాలి.
- పప్పులలో రాజుగా నిలిచిన పప్పు మామిడకాయ రెడీ .
పప్పు మామిడికాయ రెసిపీ వీడియో (You Tube) ద్వారా :